Kadapa: కిషోరి వికాసం సమ్మర్ క్యాంప్‌లో ఆరోగ్య అవగాహన

Kadapa: కడప జిల్లా సి. బయనపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో కిషోర బాలికలకు ఆరోగ్యం, అనీమియా, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 8 May 2026 5:16 PM IST
Kadapa
X

Kadapa

Kadapa: కడప జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాపాడు ప్రాజెక్టు, గుడిపాడు సెక్టార్ పరిధిలోని సి. బయనపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ‘కిషోరి వికాసం’ సమ్మర్ క్యాంప్ నిర్వహించారు.

11 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల కిషోర బాలబాలికలకు ఆరోగ్యం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా గుడిపాడు సెక్టార్ సూపర్వైజర్ సౌజన్య మాట్లాడుతూ, మే 1 నుంచి జూన్ 10 వరకు ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా బాలికల్లో రక్తహీనత సమస్యపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఐరన్, విటమిన్ల లోపం వల్ల అనీమియా సమస్య వస్తుందని, అలసట, నీరసం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. ఆకుకూరలు, గుడ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా బాల్య వివాహాల వల్ల కలిగే సమస్యలపై అవగాహన కల్పించారు. చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేయకుండా పిల్లలకు ఉన్నత విద్య అందించి భవిష్యత్తును మెరుగుపరచాలని తల్లిదండ్రులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త రాధా, ఆశా కార్యకర్త గంగ, కిషోర బాలబాలికలు, వారి తల్లులు పాల్గొన్నా

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story