Rayachoti: కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం!
Rayachoti: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆహ్వానం పలుకుతూ వేదాశీర్వచనం అందించిన ఆలయ చైర్మన్ సురేంద్రబాబు.
Rayachoti: కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం!
Rayachoti: చిన్నమండెం మండలం బొరెడ్డిగారి పల్లెలోని తన సొంత నివాసంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం చైర్మన్ శ్రీ వి. సురేంద్రబాబు మణినాయుడు గారు, ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు మంత్రివర్యులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. స్వామివారి ఆశీస్సులతో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ప్రతినిధులు మంత్రికి వివరించారు.
ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.




