Kamareddy: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ముజీబుద్దీన్ అరెస్ట్!

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, ఉద్రిక్తత. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ అరెస్ట్.

MADHU, KAMAREDDY
Published on: 8 Sept 2026 1:21 PM IST
Kamareddy
X

Kamareddy: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ముజీబుద్దీన్ అరెస్ట్!

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రైల్వే కమాన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన నేతలు.. అనంతరం వినతిపత్రం సమర్పించి రాస్తారోకో చేపట్టారు.

ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు రంగంలోకి దిగి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్‌ను అరెస్టు చేసి ఇంటికి తరలించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి.. వెయ్యి రోజులు గడిచినా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని మండిపడ్డారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన గంప గోవర్ధన్, ఎంకే ముజీబుద్దీన్.. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం విస్మరిస్తోందంటూ ఆరోపిస్తూ విగ్రహం పాదాల చెంత వినతిపత్రం సమర్పించారు.

పింఛన్ల పెంపు, కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని గంప గోవర్ధన్ డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని విమర్శించారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story