Rayachoti: రవాణా శాఖ మంత్రి మండిపల్లిని కలిసిన నూతన ఆర్టీసీ ఈడీ!
Rayachoti: ఆర్టీసీ ఈడీగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ కిషోర్ అన్నమయ్య జిల్లా బోరెడ్డిగారిపల్లెలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Rayachoti: రవాణా శాఖ మంత్రి మండిపల్లిని కలిసిన నూతన ఆర్టీసీ ఈడీ!
రాయచోటి: కడప నూతన ఆర్టీసీ ఈడీగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ కిషోర్ శుక్రవారం చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం ఇరువురు పరస్పరం అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కడప జిల్లాలో తన నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రివర్యులు కృష్ణ కిషోర్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story




