Kadapa: కడప వైసిపి ఆఫీస్‌లో స్వాతంత్య్ర వేడుకలు కూటమి ప్రభుత్వంపై అంజాద్ బాషా ధ్వజం!
Kadapa: కడప వైసీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు. జెండా ఆవిష్కరించిన రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా. కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం తీవ్ర విమర్శలు.
Kadapa: కడప వైసిపి ఆఫీస్‌లో స్వాతంత్య్ర వేడుకలు కూటమి ప్రభుత్వంపై అంజాద్ బాషా ధ్వజం!
Kadapa: ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును కూటమి ప్రభుత్వం హరించే ప్రయత్నాలు సరికాదని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ భాష అన్నారు.కడప వైసీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన అంజాద్ బాషా మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని,స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని,రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని అంజాద్ బాషా ఆరోపించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయడం జరుగుతోందని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ పాలన సాగించారని అంజాద్ బాషా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానించే వారికి భవిష్యత్తులో ప్రజలే తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.




