Kadapa: కడప జిల్లాలో రైతు సేవాసమితి 15వ రోజు 'రైతు గ్రామబాట'!
Kadapa: మైదుకూరు తహసీల్దార్ కార్యాలయంలో రైతు సేవాసమితి నిరసన. వెలుగోడు నుండి తెలుగుగంగకు నీటిని విడుదల చేయాలని, జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్.
Kadapa: కడప జిల్లాలో రైతు సేవాసమితి 15వ రోజు 'రైతు గ్రామబాట'!
Kadapa: కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగుగంగ sr1,sr2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగువేల క్యూ సెక్కులు నీటిని విడుదల చేసి కడప జిల్లా ప్రజలకు ,రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతుసేవాసమితి కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రైతు గ్రామబాట కార్యక్రమం ఈరోజు 15వ రోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి అనంతరం కార్యాలయంలో ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరడం జరిగింది.
అలాగే ఏలిననో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి 30 వేల రూపాయలు సహాయం అందజేసి ఆదుకోవాలని అలాగే జిల్లాలో పెండింగ్లో ఉన్న రాజోలి, జోలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయింపు చేసి ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్నికోరడం జరిగింది.
ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సేవాసమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, సమితి మైదుకూరు పట్టణ, మండల నాయకులు రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారిగుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




