Kadapa: మృత్యువు అంచున నలుగురు.. రక్షించిన కడప పోలీసులు!
Kadapa: కడపలో భర్త వేధింపులతో ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యకు యత్నించిన మహిళను డయల్ 112 కాల్ ద్వారా బ్లూ కోల్ట్ పోలీసులు రక్షించారు.
Kadapa: మృత్యువు అంచున నలుగురు.. రక్షించిన కడప పోలీసులు!
Kadapa: ఇద్దరు బ్లూ కోల్ట్ పోలీసుల సమయస్ఫూర్తి, వేగవంతమైన స్పందన ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్న నలుగురిని కాపాడగలిగింది. డయల్ 112 కు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించి కేవలం 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకొని రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాలనుకున్న మహిళ, ఆమె ముగ్గురు పిల్లలను సురక్షితంగా కుటుంబసభ్యుల చెంతకు చేర్చి అప్పగించి శభాష్.. పోలీస్ అని ప్రజలు, పోలీస్ అధికారుల మన్ననలు పొందారు. నిమిషం ఆలస్యమైనా రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన ఓ రైలు క్రింద పడి నలుగురు విగత జీవులుగా మిగిలేవారు.
వివరాలు చెన్నూరు పరిధిలోని శాటిలైట్ సిటీలో ఉంటున్న ఓ మహిళ భర్త వేధింపులతోముగ్గురు పిల్లలను తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఈ మేరకు మంగళవారం ఉదయం 10: 55 గంటల సమయంలో ఇంటి నుండి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లినట్లు సమీప బంధువులు డయల్ 112 కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే కమాండ్ కంట్రోల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రాజు సిబ్బందిని అప్రమత్తం చేశారు. సి.పీ బ్రౌన్ లైబ్రరీ సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న బ్లూ కోల్ట్(BC-3) సిబ్బంది కానిస్టేబుళ్లు సుబ్బారాయుడు (PC 982), జి.రాజీవ్ కుమార్ (PC 2090) లు చాకచక్యంగా,
సమయస్ఫూర్తితో వ్యవహరించి మహిళకు ఫోన్ చేసి మాటల్లో పెట్టి సదరు మహిళ మహిళ తన ముగ్గురు పిల్లలతో కడప రైల్వే స్టేషన్ నుండి తిరుపతి వెళ్లే రైలు మార్గంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. ట్రాక్ వెంబడి గాలిస్తూ ట్రాక్ పై ఉన్న బాధిత మహిళ, ముగ్గురు 11, 10, 8 సం.ల వయసున్న పిల్లలను సురక్షితం చేసారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కౌన్సిలింగ్ చేసి అప్పగించారు. కుటుంబ సభ్యులు తాము పోలీస్ శాఖకు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
అభినందించిన జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు:
కడప ఇంచార్జ్ డి.ఎస్పీ శ్రీ ఇ. బాలస్వామి రెడ్డి గారి పర్యవేక్షణ లో వేగంగా స్పందించి ఘటన స్థలానికి చేరుకొని చాకచక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి నలుగురి ప్రాణాలను కాపాడి సురక్షితంగా కుటుంబసభ్యులకు అప్పగించిన బ్లూ కోల్ట్ సిబ్బంది కానిస్టేబుళ్లు సుబ్బారాయుడు (PC 982), జి.రాజీవ్ కుమార్ (PC 2090) లను జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
బలవన్మరణం.. ఒక్క క్షణపాటులో తీసుకునే అత్యంత భయంకరమైన నిర్ణయం.. ఆవేశంతోపాటు ఎంతో ఉద్వేగంతో క్షణాల్లో ఇక జీవించలేనంటూ జీవితానికి స్వస్తి పలికే పొరపాటు నిర్ణయం.. క్షణికావేశంతో ప్రాణాలు తీసుకునే ఆ సమయంలో గనుక తాను తీసుకునే నిర్ణయం తప్పు.. నీకంటే సమస్యలతో సతమతమవుతున్న వారు ఎందరో కాలంతో పోరాడి ఎలా బ్రతుకుతున్నారో చూడు.. నీకొచ్చిన కష్టం ఏపాటిది.. అని అలోచించి ఆత్మస్థైర్యంతో జీవించాలి.




