Kadapa: సుండుపల్లిలో ప్రథమ చికిత్స కేంద్రాలు సీజ్

Kadapa: కడప జిల్లా సుండుపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాలను వైద్యాధికారి బాగ్యమ్మ సీజ్ చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 20 July 2026 1:14 PM IST
Kadapa
X

Kadapa: సుండుపల్లిలో ప్రథమ చికిత్స కేంద్రాలు సీజ్

Kadapa: కడప జిల్లా సుండుపల్లి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కొన్ని ప్రథమ చికిత్స కేంద్రాలను జిల్లా అధికారి బాగ్యమ్మ తనిఖీ చేసి సీజ్ చేశారు.

ఈ సందర్భంగా బాగ్యమ్మ మాట్లాడుతూ, అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించడం చట్టవిరుద్ధమని, ప్రథమ చికిత్స కేంద్రాల్లో ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని స్పష్టం చేశారు.

చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరియు అత్యవసర వైద్యం అవసరమైన రోగులను వెంటనే సమీప ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ఆసుపత్రులకు తరలించాలని సూచించారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. మండల కేంద్రంలో పదుల సంఖ్యలో ప్రధమ చికిత్స కేంద్రాలు ఉన్నప్పటికీ కేవలం రెండు కేంద్రాలనే సీజ్ చేయడం తీవ్ర విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story