Badvel: బద్వేలులో అగ్రో ఫారెస్ట్రీపై అవగాహన కార్యక్రమం
Badvel: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులో మంగ్రవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అగ్రో ఫారెస్ట్రీపై ఒకరోజు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహణ.
Badvel: బద్వేలులో అగ్రో ఫారెస్ట్రీపై అవగాహన కార్యక్రమం
బద్వేల్: వైయస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని పెన్షనర్స్ హోమ్ నందు 23-07-2026 గురువారం జిల్లాస్థాయిలో ఎన్జిఓ రామ సుబ్బయ్య అధ్యక్షులు ఆగ్రో ఫారెస్ట్రీపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మంగ్రవ్ ఫౌండేషన్ చైర్మన్ మీరస , ప్రోగ్రాం డైరెక్టర్ సచిన్ రాష్ట్ర కోఆర్డినేటర్ మునికృష్ణ టెక్నికల్ అసిస్టెంట్ మురుగేష్ ఫడ్స్ డైరెక్టర్ పీ. వి. రమణయ్య ప్రసాద్ రావు పాల్గొన్నారు.
చైర్మన్ మాట్లాడుతూ కార్బన్ క్రెడిట్ కింద పచ్చని తోటలు పెంచిన అనగా మామిడి,.నిమ్మ,దానిమ్మ,ఎర్రచందనం,నీలగిరి, సపోటా,కొబ్బరి,,బత్తాయి,, చౌక, జీడి మామిడి, మొదలగు తోటలు పెంచిన రైతులు ఎకరాకి 2000 రూపాయలు సర్వే చేసిన సంవత్సరానికి ఇస్తారని, వెదురు చెట్లు రైతులకు తోటలకి సహాయం చేస్తారని, పర్యావరణ పరిరక్షణ కోసం, కార్బో ఉత్పత్తులను తగ్గించడం కోసం ఈ విధంగా చేస్తున్నామని ఎన్జీవోలు, ఎన్జీవో కోఆర్డినేటర్లు సక్రముగా సర్వే చేయాలని, చెప్పారు.
స్టేట్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రైతుల దగ్గర పైసా ఆశించకుండా రైతులతో పని చేయాలని ఎన్జీవో కోఆర్డినేటర్లకి గౌరవ వేతనాలు ఇస్తామని చెప్పారు ప్రోగ్రాం డైరెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది అంతా సక్రమంగా పనిచేయాలని ఇది మంచి అవకాశం అని తోటలను కొలిసిన తర్వాతే రైతులకు అమౌంట్ ఇస్తారని చెప్పారు అనంతరం టెక్నికల్ అసిస్టెంట్ మురుగేష్ మాట్లాడుతూ కోఆర్డినేటర్ లు యాపు ద్వారా సర్వేచేయాలని ఈ కార్యక్రమంలో కడప జిల్లాలోని అన్ని మండలాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.




