Kadapa: కడప జిల్లాలో ఘోరం.. డబ్బుల కోసం భార్యను చంపేసిన భర్త!
Kadapa: కడప వీరబల్లిలో గల్ఫ్‌లో సంపాదించిన నగదు, బంగారం కోసం భార్యను చంపిన భర్త, సవతి కొడుకును 6 నెలల దర్యాప్తు తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు.
Kadapa: కడప జిల్లాలో ఘోరం.. డబ్బుల కోసం భార్యను చంపేసిన భర్త!
భార్య హత్య చేసి బావిలో పడేసిన భర్త, సవతి కొడుకు
కడప జిల్లా: వీరబల్లి మండలం తాటిగుంటపల్లి గ్రామం కొత్తపల్లి కి చెందిన రమణయ్య రాయచోటి మండలం చెంచురెడ్డిగారిపల్లె కు చెందిన వెంకట లక్ష్మమ్మ (47) అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.
కువైట్ కి వెళ్ళిన వెంకటలక్ష్మమ్మ అక్కడ సంపాదించిన బంగారు, నగదు ను రమణయ్య కు పంపించింది.
ఆమె అక్కడ అనారోగ్యానికి గురై తిరిగి ఇంటికి వచ్చింది.
వైద్య ఖర్చుల తన దగ్గర స్తోమతి లేకపోవడంతో తాను సంపాదించిన బంగారం, నగదు తనకు ఇచ్చేస్తే తాను తన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుంటానని భర్త రమణయ్య తో తరచూ గొడవపడేది. దీంతో రమణయ్య తన మొదటి భార్య కుమారుడు శివ మహేష్ తో కలిసి వెంకట లక్ష్మమ్మ ను అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది జనవరి 31న వెంకట లక్ష్మమ్మను కొట్టు చంపి గ్రామ శివారులోని బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు.
మృతురాలి సోదరుడు గంగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పట్లో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
6 నెలలపాటు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానస్పద మృతి కేసును హత్య కేసుగా తేల్చారు.
కేసులో నిందితులుగా ఉన్న తండ్రి కొడుకులు రమణయ్య, శివ మహేష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సుండుపల్లి సీఐ సురేష్ రెడ్డి తెలిపారు.
కేసును ఛాలెంజ్ గా తీసుకొని చేదించిన వీరబల్లి ఎస్ఐ సుస్మిత, పోలీసు సిబ్బందిని సీఐ సురేష్ రెడ్డి అభినందించారు.




