Badvel: దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: సీపీఎం చంద్రశేఖర్
Badvel: కడప జిల్లా గోపవరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట దళితవాడల మౌలిక వసతుల కోసం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Badvel: దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: సీపీఎం చంద్రశేఖర్
కడప జిల్లా గోపవరం మండలం
పేదరికం పెంచే ఆర్థిక విధానాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
కులగణన 80 సంవత్సరాల స్వాతంత్ర్యనంతరం ఎప్పుడు చేయలేదు.
దళితవాడలో మౌలిక సౌకర్యాల కల్పించాలి.
దళితులపై మోపుతున్న నింద ప్రచారాలో వాస్తవాలు లేవు.
దళితవాడల్లో ప్రజలు ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో దయానియంగా ఉన్నారు.
పేదల భూములను కబ్జా చేసేవారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి.
"కాక్రోచ్ ఉద్యమం" దళితవాడల నుండే ప్రారంభం కాబోతోంది.
ప్రజల ఉమ్మడి సంపదలో దళితుల వాటా మింగేస్తున్నారు.
దళిత వాడలకు మౌలిక సౌకర్యాల కోసం "ధర్నా" .
సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్.
2026 ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు, గోపవరం మండలం రెవెన్యూ తాసిల్దార్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.ఏ.డబ్ల్యు ), కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కె.వి.పి.ఎస్. ) సంయుక్తంగా "దళిత వాడలకు మౌలిక సౌకర్యాల కోసం" ధర్నా చేపట్టారు.
పేద దళితుల సమస్యలపై జరుగుతున్న ఆందోళనకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మద్దతు తెలియజేసి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ... ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు పేదరికం మరింత పెంచే విధంగా ఉన్నాయని విమర్శించారు. దేశంలో కుల గణన 80 సంవత్సరాల స్వాతంత్ర్య అనంతరం ఎప్పుడూ జరగలేదని ప్రజల ఆర్థిక, సామాజిక, సాంఘిక వాస్తవిక పరిస్థితులుపై ప్రభుత్వాల వద్ద గణాంక లెక్కలు లేవని, సుప్రీంకోర్టు వెంటనే కుల గణన చేసి, ఏ సామాజిక వర్గాలు, ఏ పరిస్థితుల్లో ఉందో నిజనిర్ధారణ గణాంక లెక్కలు తెలియజేయాలని పలుమార్లు తీర్పులు ఇచ్చిన, కేంద్ర , రాష్ట్రల ప్రభుత్వాలు ఉలుకు పలుకు లేకుండా నిస్తేజంగా ఉన్నాయని తెలియజేశారు. దళితవాడలో జులై 1 నుండి 29వ తేదీ వరకు సర్వేలు నిర్వహించామని, ప్రతి దళిత కుటుంబంలోనూ అంగవైకల్యం, ఆర్థిక బలహీనత , సామాజిక వెనుకబాటు తనం , సాంఘిక వివక్షత కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయని తెలియజేశారు. కనీస మౌలిక సౌకర్యాలైన మంచినీరు, రోడ్లు, కరెంటు వీధి దీపాలు, డ్రైనేజీ కాలవలు, స్మశాన వాటికలు, అంగన్వాడి సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లాంటివి చాలావరకు అందుబాటులో లేవన్నారు. నేటి సమాజంలో దళితులకు ఇచ్చిన కొద్దిపాటి ప్రభుత్వ డీకేటి భూములను ఆన్లైన్లో లేకుండా చేసి, రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించకుండా వారి భూముల్లో వారే పరాయి వారిగా కొనసాగించేలాగా ప్రభుత్వాలు మౌనంగా దళితులను సాధిస్తున్నాయని గుర్తు చేశారు. దళితుల భూములు కబ్జా చేసే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు, పిడి యాక్టులు పెట్టి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. నేడు ఢిల్లీలో ప్రారంభమైన కాక్రోచ్ విద్యార్థి యువకుల ఉద్యమం, భవిష్యత్తులో ప్రతి దళిత గ్రామం నుండి ప్రారంభం కాబోతోందని, ప్రభుత్వాలు గుర్తిరిగి పేద దళితుల సమస్యలను పరిష్కరించాలని హెచ్చరించారు. సమాజంలోని ప్రజల ఉమ్మడి సంపదలో రాజ్యాంగం ఆదేశాల మేరకు ప్రతి కేంద్ర రాష్ట్రాల బడ్జెట్లో 17% నిధులను దళితులకే ఖర్చు పెట్టాలని, ఆ వాటాను కొద్దిమంది పెద్దలు మింగేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్, మండల నాయకులు రాంబాబు, పుష్పమ్మ, యానాదయ్య, సాయి, గోపయ్య, ప్రదీప్ మరియు సుమారు నూరు మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.




