Kadapa: కడప కలెక్టరేట్‌లో కారుణ్య ఉద్యోగాల పంపిణీ పర్వం
Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లాలో 58 మందికి కారుణ్య నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అందజేశారు.
Kadapa: కడప కలెక్టరేట్‌లో కారుణ్య ఉద్యోగాల పంపిణీ పర్వం
కడప: ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. నిబద్దతతో పనిచేస్తూ.. కుటుంబాలకు ఆసరాగా నిలవాలని.. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సూచించారు.
కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. కారుణ్య పథకం ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందిన మొత్తం 58 మందికి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్బంగా ఉద్యోగాలు పొందిన వారిని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు పొందిన వారు.. ఇంట్లో పెద్దదిక్కుగా వ్యవహరిస్తూ.. ఇటు ఉద్యోగ ధర్మాన్ని, అటు ఇంటి బాధ్యతలను మరువకుండా.. నిబద్ధతతో.. విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రస్తుతం రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ లో.. ప్రభుత్వ ఉద్యోగిగా నిర్వర్తించగలిగే విధులపై పూర్తి స్తాయి అవగాహన పెంచుకోవాలన్నారు. ఎక్కడా కూడా ఆక్రమార్జనకు ఆశపడకుండా.. సక్రమమైన మార్గంలో నడుస్తూ.. ఉద్యోగ ధర్మంలో గౌరవాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్వో మల్లికార్జునుడు, కలెక్టరేట్ ఏ.ఓ. గంగయ్య, ఉద్యోగాలు పొందిన కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




