Kadapa: కడప వియత్నాం ప్రమాద బాధితుడు శ్రీధర్ మృతదేహానికి నివాళి

Kadapa: వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన శ్రీధర్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కడప కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి. కుటుంబానికి అండగా ఉంటామని హామీ.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 14 July 2026 9:28 PM IST
Kadapa
X

Kadapa: కడప వియత్నాం ప్రమాద బాధితుడు శ్రీధర్ మృతదేహానికి నివాళి

కడప: వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన ముడియం శ్రీధర్ భౌతికకాయం కడపకు చేరుకున్న సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారి అకాల మరణం తీవ్ర విషాదకరమనన్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, జిల్లా యంత్రాంగం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మృతుడు శ్రీధర్ పనిచేసిన కంపెనీ తరపున అందించాల్సిన పరిహారం, సహాయ సహకారాలు, ఇతర అవసరమైన చర్యలు త్వరగా పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story