Kadapa: బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులకు క్రీడా సామగ్రి పంపిణీ

Kadapa: కడప తాలూకా సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించి విద్యార్థినులకు వివిధ క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 1 Sept 2026 7:46 PM IST
Kadapa
X

Kadapa: బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులకు క్రీడా సామగ్రి పంపిణీ

కడప: కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ బాలికల హాస్టల్‌ను గత ఆగస్టు 15వ తేదీన సందర్శించిన కడప తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ రాజేంద్రనాథ్ యాదవ్ గారు, విద్యార్థినులు చదువుతో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదిగి క్రీడల్లోనూ రాణించాలనే ఉద్దేశంతో ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం (01.09.2026) సాయంత్రం సీఐ శ్రీ రాజేంద్రనాథ్ యాదవ్ గారు, ఎస్‌ఐ శ్రీ నారాయణ గారు మరియు పోలీసు సిబ్బందితో కలిసి బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించి విద్యార్థినులకు వివిధ రకాల క్రీడా సామగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా క్యారమ్ బోర్డులు, త్రో బాల్స్, చెస్ బోర్డులు, క్రికెట్ బ్యాట్లు, బాల్స్, రింగ్ బాల్స్, స్కిప్పింగ్ రోప్స్, షటిల్ బ్యాట్లు, రైటింగ్ బోర్డులు తదితర సామగ్రిని విద్యార్థినులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సీ.ఐ రాజేంద్రనాథ్ యాదవ్ గారు మాట్లాడుతూ, అబ్బాయిలకు ఏ మాత్రం తీసిపోకుండా అమ్మాయిలు కూడా విద్యతో పాటు క్రీడారంగంలో ప్రతిభ కనబర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, ప్రతి విద్యార్థిని చదువుతో పాటు ఏదో ఒక క్రీడలో పాల్గొని తమ ప్రతిభను చాటాలని సూచించారు.

తమ కోసం ప్రత్యేకంగా క్రీడా సామగ్రిని అందజేసిన సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ గారికి బీసీ హాస్టల్ విద్యార్థినులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.

కాగా, సీఐ శ్రీ రాజేంద్రనాథ్ యాదవ్ గారు గతంలో తాను విధులు నిర్వహించిన ప్రాంతాల్లో కూడా నిరుపేద విద్యార్థులు, విద్యార్థినులకు పుస్తకాలు, దుస్తులు, క్రీడా సామగ్రి అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారని తెలిసింది.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story