Kadapa: రాజ్యాంగాన్ని మార్చే కుట్రను విరమించుకోవాలి చింతామోహన్
Kadapa: కడపలో మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ కామెంట్స్. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే దేశం రెండు ముక్కలయ్యే ప్రమాదం ఉందని ప్రధాని మోదీ, అమిత్ షాలపై విమర్శలు.
Kadapa: రాజ్యాంగాన్ని మార్చే కుట్రను విరమించుకోవాలి చింతామోహన్
కడప: చదువురాని ఏమీ తెలియని ఇద్దరు నాయకులు భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ఆరోపించారు.
కడప ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చింతామోహన్ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి ఉపయోగపడేలా చక్కటి రాజ్యాంగం రాయడం జరిగిందని, ప్రధాని మోడీకి చదువు రాదని రాజ్యాంగము గురించి పెద్దగా తెలియదని, భారత రాజ్యాంగం మార్పు వల్ల దేశం రెండు ముక్కలు అయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంగా విడిపోయే ప్రమాదం ఉందని రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచనను విరమించుకోవాలని సూచించారు.
మోడీ అమిత్ షా 12 సంవత్సరాల పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని, చిన్న మధ్యతరగతి కుటుంబాలలో ఆర్థిక సంక్షోభం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రం రెండు కుటుంబాల పాలనలో అప్పుల మయం అయిందన్నారు.




