Kadapa: కడపను సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి: జేసీ!

Kadapa: వైఎస్సార్ కడప జిల్లా కలెక్టరేట్‌లో జేసీ డాక్టర్ నిధి మీనా పీజీఆర్ఎస్ అర్జీలను స్వీకరించారు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 10 Aug 2026 11:12 PM IST
Kadapa
X

Kadapa: కడపను సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి: జేసీ!

కడప: వికసిత భారత్ లక్ష్యాలను అధిగమిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల స్పూర్తితో.. కడపను సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధీమీనా జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సభాభవన్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జేసీ డా. నిధి మీనా.. డిఆర్వో మల్లికార్జునుడు తోకలిసి ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు.

అనంతరం అధికారులతో జేసీ డా. నిధీమీనా మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) ద్వారా అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే తగిన పరిష్కారం చూపాలని సూచించారు. వికసిత భారత్ లక్ష్యాలను అధిగమిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల స్పూర్తితో.. వైఎస్ఆర్ కడప జిల్లాను సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు.

అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పిజిఆర్ఎస్ వ్యవస్థపై అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తూ.. ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. పీజీఆర్ఎస్ పై ప్రజల అభిప్రాయాలను తప్పక స్వీకరించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్‌లను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. తహసీల్దార్లు, శాఖాధిపతులు, పీజీఆర్ఎస్ సిబ్బంది ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.

ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ.. సమస్యలకు తావులేని స్వేచ్చాయుత జీవనాన్ని జిల్లా ప్రజలకు అందించాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా 2029 రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలపై దృష్టి సారించాలన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ చర్యలు, ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ప్రత్యామ్నాయ సాగు విధానాలపై జిల్లా ప్రజలు, రైతుల్లో అవగాహన పెంచాలని జేసీ అధికారులకు సూచించారు. ఇందుకోసం నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం, ఎస్డీసీ వెంకటపతి, డిప్యూటీ కలెక్టర్లు శివ రామిరెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story