Madanapalle: రేణిగుంట ఎయిర్‌పోర్టులో జనసేన నేతల ఘన స్వాగతం!

Madanapalle: రేణిగుంట విమానాశ్రయంలో రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్‌ను కలిసిన జనసేన నేతలు అడపా సురేంద్ర, రామదాసు చౌదరి. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా కీలక చర్చలు.

Srinivasulu, Madanapalle
Published on: 11 Sept 2026 11:01 PM IST
Madanapalle
X

Madanapalle: రేణిగుంట ఎయిర్‌పోర్టులో జనసేన నేతల ఘన స్వాగతం!

మదనపల్లె: రేణిగుంట విమానాశ్రయానికి శుక్రవారం విచ్చేసిన రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే దేవా వరప్రసాద్‌ను మదనపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి గంగారపు రామదాసు చౌదరి, ఏఎంసీ మార్కెట్ యార్డు చైర్మన్ జంగాల శివరాం, బండి మనోహర్, రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యే దేవా వరప్రసాద్‌తో నాయకులు కీలకంగా చర్చించారు. స్థానిక ఎన్నికలను జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా స్థానిక స్థాయిలో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని, కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని దేవా వరప్రసాద్ ఆకాంక్షించారు.

అదే సందర్భంగా తాతంశెట్టి నాగేంద్ర, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌లు కూడా దేవా వరప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. రాబోయే కార్యక్రమాలకు ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన, కూటమి నాయకుల మధ్య సమన్వయం, పరస్పర చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle