Kadapa: కడప పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర వేడుకల భద్రతా ఏర్పాట్లు పూర్తి!

Kadapa: కడప పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వేడుకల రిహార్సల్స్ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీలు ప్రకాష్ బాబు, రమణయ్య భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 14 Aug 2026 4:34 PM IST
Kadapa
X

Kadapa: కడప పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర వేడుకల భద్రతా ఏర్పాట్లు పూర్తి!

Kadapa: రేపు జరగబోయే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంధర్బంగా కట్టుదిట్టమైన గట్టి భద్రత ఏర్పాట్లు చేశామని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ కె.ప్రకాష్ బాబు గారు , ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ బి.రమణయ్య గారు తెలిపారు.

జిల్లా పోలీసు కార్యాలయంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల పరేడ్ రిహార్సల్స్ శుక్రవారం ఉదయం నిర్వహించారు.వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల పరేడ్ రిహార్సల్స్ కు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీ కె.ప్రకాష్ బాబు గారు , ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ బి.రమణయ్య గారులు హాజరై పరిశీలించారు.

స్వాతంత్య్ర వేడుకలకు ప్రముఖులు హాజరవుతున్న సంధర్బంగా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు నిఘా ను పటిష్టం చేయాలన్నారు. పలు సూచనలు చేశారు.పోలీస్ జాగిలాలు గ్రౌండ్ నందు చేసిన విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో పెరేడ్ కమాండర్ గా ఏ.ఆర్ డిఎస్పీ శ్రీ పి.నాగేశ్వర రావు గారు రిహార్సల్స్ లో పాల్గొన్నారు. పెరేడ్ సెకండ్ ఇంచార్జ్ కమాండర్ ఆర్ ఎస్సై కె.వెంకటేశ్వర్లు పెరేడ్ మార్చింగ్ నిర్వహించారు. ఆర్ ఐలు సోమశేఖర్ నాయక్, పెద్దయ్య, టైటస్, సివిల్ , ఏ ఆర్, పోలీసు, హోంగార్డ్సు , ఎన్.సి.సి విద్యార్థులు , స్కౌట్ విద్యార్దులు పాల్గొన్నారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story