Rayachoty: సివిల్ వివాదంలో పోలీసుల జోక్యంపై హైకోర్టు నోటీసులు
Rayachoty: సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని వేధించారంటూ రాయచోటి సీఐ బీవీ చలపతి, ఎస్సై జహీర్‌లపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Rayachoty: సివిల్ వివాదంలో పోలీసుల జోక్యంపై హైకోర్టు నోటీసులు
Rayachoty: రాయచోటి అర్బన్ సిఐ బీ.వీ.చలపతి, ఎస్సై జహీర్ కలిసి సివిల్ కేసులో జోక్యం చేసుకొని తమ ప్రతివాదులకు సహాయం చేయడానికి తమను వేధించారంటూ రాయచోటి పట్టణానికి చెందిన పసుపులేటి రాజశేఖర్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్( WP No. 16653/2026) దాఖలు చేయగా, సివిల్ కేసులో జోక్యం వద్దంటూ సిఐ బీవీ చలపతికి ఎస్సై జహీర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి రాయచోటి పట్టణం మాసాపేట గ్రామం పూల తోటపల్లి సర్వేనెంబర్ 4/1ఏ 1 లోని 40 చదరపు గజాల ఇంటి జాగా తమ పూర్వీకులకు సంబంధించినదని అందులో తమ ఒక వాటా రావాలని పసుపులేటి రాజశేఖర్ అతని కుటుంబ సభ్యులు రాయచోటి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో భాగ పరిష్కారం కేసు ఓ ఎస్ నెంబర్. 126/2026 దాఖలు చేశారు. అయితే కేసు పెండింగ్ ఉండగానే అతని ప్రత్యర్ధులు వివాద స్థలంలో 13.06.2026 తేదీన ఇంటి నిర్మాణం పనులు మొదలుపెట్టారు.
రాజశేఖర్ కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణం చేపట్టడానికి వీలు లేదంటూ తమ వాటా మాకు ఇచ్చిన తర్వాతనే ఏదైనా చేసుకోవాలని అభ్యంతరం తెలిపారు. దీనితో రాజశేఖర్ ప్రత్యర్థులు అబ్బవరం రెడ్డమ్మ, తిరుపతమ్మ రాయచోటి అర్బన్ సీఐ బీవీ చలపతిని కలిసి ఫిర్యాదు చేశారు. దీనితో రాయితోటి అర్బన్ సీఐ చలపతి రాజశేఖర కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు 13.06.2026 తేదీన పిలిపించి రోజంతా పోలీస్ స్టేషన్ లో ఉంచి బెదిరించి వేధింపులకు గురి చేసి బట్టలు విప్పదీసి ఆరోజు సాయంత్రం వరకు పోలీస్ రిమాండ్ లో అక్రమంగా ఉంచారని రాజశేఖర్ హైకోర్టుకు తెలిపారు.
పోలీసులు దగ్గరుండి తమ ప్రత్యర్థుల చేత ఇంటి నిర్మాణం చేయించారని తమను మాత్రం పోలీస్ స్టేషన్ లోనే ఉంచి ప్రత్యర్థులు జరిపే అక్రమ కట్టడానికి సపోర్ట్ చేశారని రాజశేఖర్ హైకోర్టును 22.06.2026 తేదీన ఆశ్రయించి జరిగిన సంఘటనను హైకోర్టుకు వివరించారు. కేసును పరిశీలించిన హైకోర్టు, ఏ అధికారంతో సీఐ చలపతి, రాజశేఖర్ ను అతని కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కి పిలిపించి వేధింపులకు గురి చేశారో తెలపాలంటూ సిఐ చలపతికి 18.07.2026 తేదీన హైకోర్టు నోటీసులు జారీచేసి కేసును ఈనెల 22 కు వాయిదా వేసింది. అంతవరకు రాజశేఖర్ ఇంటి జాగా లోనికి పోలీసులు కానీ రాజశేఖర్ ప్రత్యర్థులు గాని ప్రవేశించడానికి వీలు లేదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.




