Annamayya: బోయకొండలో వీఐపీ దర్శనాలు రద్దు లైన్లలో కిక్కిరిసిన భక్తులు!

Annamayya: అన్నమయ్య జిల్లా పుంగనూరు పరిధిలోని ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం భక్తజన సంద్రమైంది.

MAHESH, PUNGANOOR
Published on: 26 July 2026 5:26 PM IST
Annamayya
X

Annamayya: బోయకొండలో వీఐపీ దర్శనాలు రద్దు లైన్లలో కిక్కిరిసిన భక్తులు!

అన్నమయ్య: ఆషాడ మాసం రెండవ ఆదివారం శ్రీ బోయకొండ గంగమ్మ శక్తి క్షేత్రంలో భక్తులు పోటెత్తారు రాష్ట్రం తో పాటు కర్ణాటక తమిళనాడు ల నుంచి ఉదయాన్నే అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనార్థం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు గంగాపురం నుంచి అమ్మవారి సన్నిధానం వరకు ఎక్కడ చూసినా భక్త జన సందోహం కనిపించింది.

రణభేరి గంగమ్మ ఆలయం నుంచి అమ్మవారి పుష్కరిణి వరకు ఎక్కడపడితే అక్కడ వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం వాటిలింది క్యూలైన్లు సన్నిధానం పెద్ద భోగం చిన్న భోగం కార్యాలయ సముదాయం వంటి ప్రాంతాలలో ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం పర్యవేక్షించారు ఆషాడమాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందస్తుగా ఆలయ ఈవో విఐపి దర్శనాలను ఆదివారం రద్దు చేయడంతో వీఐపీ క్యూ లైన్లతో సహా భక్తులతో నిండిపోయాయి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు.

క్యూ లైన్ లలో పలు చోట్ల ప్రక్షాళన చేయడం వల్ల సాధారణ భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం సులభంగా జరిగింది ఆలయ పరిసర ప్రాంతాలు వాహన రాకపోకలు అంతరాయం వాటిల్లకుండా ఎస్సై చిన్న రెడ్డప్ప బందోబస్తు చర్యలు తీసుకున్నారు మదనపల్లి నుంచి పలువురు చిన్నారులు తరలివచ్చి అమ్మవారి కి తమ మొక్కులను చెల్లించుకునిమంత్రముగ్ధులయ్యారు. ఆలయ అధికార అర్చక సిబ్బంది భక్తులకు సేవలు అందించారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story