Rayachoti: సాకిబండ చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన హరితమ్మ!
Rayachoti: చిన్నమండెం సాకిబండ గ్రామంలో చెరువు అభివృద్ధి పనులను మంత్రి మండిపల్లి సతీమణి హరితమ్మ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికే కట్టుబడి ఉంది.
Rayachoti: సాకిబండ చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన హరితమ్మ!
అన్నమయ్య జిల్లా
రాయచోటి
చాకిబండలో చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి మండిపల్లిసతీమణి హరితమ్మ..
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం సాకిబండ గ్రామంలో గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమానికి దోహదపడే చెరువు అభివృద్ధి పనులను మండిపల్లి హరితమ్మ ప్రారంభించారు. చెరువు అభివృద్ధి ద్వారా సాగునీటి సౌకర్యం మెరుగుపడి రైతులకు విశేష ప్రయోజనం చేకూరనుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చిన్నమండెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముగిరెడ్డప్ప, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
గ్రామాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతు తెలుపుతున్నారని నాయకులు పేర్కొన్నారు.




