Rayachoty: చంద్రబాబుపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజం!

Rayachoty: రాయచోటిలో సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 10 July 2026 10:46 AM IST
Rayachoty
X

Rayachoty: చంద్రబాబుపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజం!

Rayachoty: సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితం అంతా దోచుకోవడం, దాచుకోవడం, దోచిపెట్టడమే ఆయన పని అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు లో ఏమాత్రం మార్పు రాలేదని ఆరోపించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని కేంద్రానికి రిటర్న్ పూర్వకంగా లేఖ రాసిచ్చిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇది అని ఆరోపించారు. ఎంత మోసం చేస్తున్నారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు.

ఆరోగ్యాన్ని ప్రైవేటు పరం చేసి అమ్ముకోవాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు పై ధ్వజమెత్తారు. పోర్టులను సైతం ప్రైవేటు వ్యక్తులకు ధారధత్వం చేయాలని చూస్తున్నారని, జగన్ ప్రభుత్వంలోనే పోర్టులు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. తామెప్పుడూ రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్ర భవిష్యత్తును బూడిద పాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యావ్యవస్థను సైతం బ్రష్టు పట్టించారని కూటమి ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story