Rayachoty: చెన్నముక్కపల్లి ఉచిత కంటి వైద్య శిబిరం అద్దాలు పంపిణీ!

Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి లయన్స్ కంటి ఆసుపత్రిలో 15 మంది రోగులకు కంటి ఆపరేషన్లు నిర్వహించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 9 Aug 2026 5:56 PM IST
Rayachoty
X

Rayachoty: చెన్నముక్కపల్లి ఉచిత కంటి వైద్య శిబిరం అద్దాలు పంపిణీ!

రాయచోటి: రాయచోటి మండల పరిధిలోని చెన్నముక్కపల్లి గ్రామంలో గల లయన్స్ కంటి ఆసుపత్రిలో ఆదివారం జరిగిన కంటి వైద్య శిబిరంలో 15 మంది కంటి రోగులకు ఆపరేషన్ లు నిర్వహించారు.ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంతో పాటు రాజంపేట,రైల్వే కోడూరు,సుండుపల్లె,వీరబల్లి, యర్రావారిపాలెం,కేవీపల్లి,కలకడ,కలికిరి,పీలేరు,గుర్రంకొండ,పెద్దమండెం,ఎన్.పి.కుంట,చక్రాయపేట,కడప తదితర ప్రాంతాల నుండి వచ్చిన 40 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించిన కంటి వైద్యులు అందులో అర్హులైన 15 మంది కంటి రోగులకు ఆపరేషన్ లు నిర్వహించారు.

అలాగే గతంలో ఆపరేషన్ చేయించుకున్న 30 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు,అద్దాలు పంపిణీ చేశారు.అనంతరం కంటి ఆపరేషన్ ల కోసం వచ్చిన కంటి రోగులతో పాటు వారి వెంట ఉన్న సహాయకులకు అన్నమయ్య జిల్లా పరిధిలోని గుర్రంకొండ మండలం నడిమి కండ్రిగ పంచాయతీలోని మొటుకు గ్రామానికి చెందిన దాత ఎన్నారై ఎర్రగొండ గోవర్ధన్ రెడ్డి సతీమణి ఎర్రగొండ సుప్రియ కంటి రోగులకు అన్నదానం చేశారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ కంటి ఆసుపత్రి చైర్మన్ వై.వి.ఆర్ స్వరూప్ గుప్తా,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెన్నూరు అన్వర్ భాష,ఏపీఐఐసి మాజీ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి,న్యాయవాది గాలివీటి పవనిశ్ రెడ్డి,ఎర్రగొండ సిద్ధారెడ్డి,కంటి వైద్యులు భార్గవి,ఆఫ్తాలిక్ అసిస్టెంట్ మూలి రాజగోపాల్ రెడ్డి,ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story