Pulivendula: టీడీపీ డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలి.. వరప్రసాద్

Pulivendula: పులివెందులలో వైఎస్సార్సీపీ ర్యాలీ విజయవంతం కావడంతో టిడిపి నేతలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ మండిపడ్డారు.

T. AMARNATH, PULIVENDULA
Published on: 13 Jun 2026 8:28 PM IST
Pulivendula
X

Pulivendula: టీడీపీ డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలి.. వరప్రసాద్ 

Pulivendula: మాజీ మునిసిపల్ ఛైర్మెన్ వరప్రసాద్ మాట్లాడుతూ నిన్నటి ర్యాలీ భారీగా విజయవంతం కావడంతో టీడీపీ నాయకులు దిక్కుతోచక లేనిపోని ఆరోపణలు చేస్తూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు.

రిమోట్ ఏరియా గా ఉన్న పులివెందుల ప్రాంతాన్ని ప్రజల అండతో అన్ని విధాలా అభివృద్ధి చేసిన కుటుంబం వైయస్ కుటుంబం అయితే అధికార మదం తో అక్రమాలతో పులివెందులకు , ప్రజలకు కన్నం వేస్తున్న ఘనత టీడీపీ నాయకులది.

కిరికిరి భాషా గుర్తు పెట్టుకో,మా నాయకుడు ఎంపీ అవినాష్ రెడ్డి నిజాయితీ పరుడు గొప్ప వారు కాబట్టే మీరు చేస్తున్న అన్ని ఆరోపణలపై ప్రమాణానికి సిద్ధం అని సవాలు విసరడం జరిగింది. దానికి ఇంతవరకు కనీసం మీ నాయకుల నుంచి సమాధానమే రాలేదు.

మెడికల్ కాలేజీ నిర్మాణ నిబంధనల ప్రకారం ఉపయోగించాల్సిన కంకర స్టేజి 3 క్రషర్ ప్లాంట్ అయ్యి ఉండి వైట్ గ్రానైట్ మెటల్ లో క్యూబికల్ ఆకారం లో ఉండాలనే నిబంధన ఉండటం వలనే ఇంజినీర్ల సలహా మేరకే మన జిల్లాలో చక్రాయపేట మండలం లో ఉన్న ఒకే ఒక్క స్టేజి 3 వైట్ మెటల్ క్రషర్ నుంచి తీసుకోవడం జరిగింది, వాస్తవం తెలుసుకోకుండా ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఆరోపణలు చేయడం టీడీపీ నాయకులు మానుకోవాలి.

కిరి కిరి భాషా నువ్వు మీ నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడే చక్రాయపేట లో దాడులకు దిగడం, మీ పార్టీ లో ఉండేవారు కిడ్నాప్ లు, అక్రమాలు చేయడం వాస్తవం కాదా,నిజంగా మేము ఆరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీ పరిస్థితి ఏంటో గుర్తు చేసుకోవాలని. ఈ రోజు మీరు చేస్తున్న , మాట్లాడుతున్న ప్రతి పదానికి సమాధానం చెప్పుకోవాల్సిన రోజులు వస్తాయని అవన్నీ గుర్తు పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు.

విశ్వనాథ రెడ్డి కి నాకు అంత సాన్నిహిత్యం లేదు, వాళ్ళింటికి నేను పోలేదు, నా ఇంటికి అతను రాలేదు విశ్వనాథ్ నువ్వేమీ ఆర్చేవాడివా, తీర్చే వాడివా, నీ స్థాయి ఏంటి వైఎస్ కుటుంబం దగ్గరగా ఉండేవాడివి కాబట్టి అందరికీ తెలిసివుండచ్చు అంతే కానీ నువ్వే పెద్ద నాయకుడివి అని నేను నీ దగ్గర కన్నీలు పెట్టుకున్నానా అని మాట్లాడితే పరిపక్వత ఉండాలని.

మూడు పార్టీ లు కలిసి ర్యాలీ చేస్తే 600 మంది వస్తే అది చూసి మేము జడుసుకోవడం కాదు నిన్న జరిగిన ర్యాలీలో దాదాపు 8000 మంది పాల్గొనడం జరిగింది, దానికి మీరు ఏమీ కావాలో చెప్పాలని.

మున్సిపాలిటీ లో అధికారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికీ అనేక సమస్యలు ప్రజలను పీడిస్తున్నాయని, మా ఎంపీ గారు సొంత నిధులతో, ఎంపీ ఫండ్స్ తో ఇంకా అభివృద్ధి పనులు చేస్తున్నారని.

చేతనైతే అసంపూర్తిగా ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని, మా హయాం లో మున్సిపాలిటీ కి రెండు సార్లు అవార్డులు రావడం జరిగింది అని, ఇప్పుడు మున్సిపాలిటీ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కోడి రమణ మాట్లాడుతూ మహబూబ్ భాషా నువ్వు ఇసుక గురించి ఏమి తెలుసునని మాట్లాడుతున్నావ్, నేను ఇసుక రీచ్ లో ఒక్క బండి అయినా రూల్స్ కి వ్యతిరేకంగా తెచ్చుకున్నట్లు కాణిపాకం వచ్చి ప్రమాణం చేయగలవా అని.

మీరు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి తో పాటు ఇచ్చిన ప్రతి హామీ సంపూర్తిగా అమలు చేసేంతవరకు ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూనే ఉంటాం.

కార్యక్రమం లో మునిసిపల్ ఛైర్మెన్ వరప్రసాద్, వైస్ ఛైర్మెన్ హఫీజుల్లా, సీనియర్ నాయకులు కోడి రమణ, పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్ పాల్గొన్నారు.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA

Next Story