Kadapa: విద్యుత్ లైన్ అలైన్మెంట్ మార్చాలని రైతుల ధర్నా
Kadapa: కె.దిన్నెలో 765 కెవి విద్యుత్ లైన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏపీ రైతు సంఘం నిరసన. అలైన్‌మెంట్ మార్చాలని పవర్ గ్రిడ్ అధికారులకు వినతిపత్రం అందజేత.
Kadapa: విద్యుత్ లైన్ అలైన్మెంట్ మార్చాలని రైతుల ధర్నా
కడప: కడప జిల్లా సికేదిన్నె మండలం 765 కెవి విద్యుత్ హై వోల్టేజ్ లైన్ రావడంతో విలువైన పంట భూముల రైతాంగం తీవ్రంగా నష్టపోతారని తక్షణమే లైన్ అలైన్మెంట్ మార్చాలని ఏపీ రైతు సంఘం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్ టి పి సి పవర్ గ్రిడ్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి హాజరై ఆయన మాట్లాడుతూ విద్యుత్ హై వోల్టేజ్ లైన్ పై ప్రజాభి ప్రాయ సేకరణ జరిగిన సందర్భంలో రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించారని మా విలువైన భూముల్లో లైను వద్దు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించినా కూడా స్టెరిలైట్ యాజమాన్యం రైతుల అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆయన తెలిపారు.
అనంతరం పవర్ గ్రేట్ అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపాలకృష్ణయ్య దస్తగిరి రెడ్డి మండల రైతు సంఘం నాయకులు చిన్న సిద్దయ్య శ్రీనివాస్ రెడ్డి బాధిత రైతులు సుబ్బారెడ్డి రమణారెడ్డి శ్రీనివాసులు రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రఫీ నాగమల్లారెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




