Proddatur: ఈద్గా మసీదులో మైనార్టీ నేతల సమీక్ష!
Proddatur: ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్టాక్ అహ్మద్, షేక్ కార్పొరేషన్ చైర్మన్ డా. వీఎస్ ముక్తియార్ మైనార్టీ నాయకులతో కీలక చర్చలు జరిపారు.
Proddatur: ఈద్గా మసీదులో మైనార్టీ నేతల సమీక్ష!
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు కొర్రపాడు లోని ఈద్గా మసీదులో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్టాక్ అహ్మద్, ఏపీ స్టేట్ షేక్ కార్పొరేషన్ చైర్మన్ & టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా VS ముక్తియార్ ప్రొద్దుటూరు లోని పేద ముస్లిం మహిళలు వితంతువు మహిళల కోసం మైనారిటీ నాయకులతో చర్చించారు.
ముస్టాక్ అహ్మద్ మాట్లాడుతూ మన పట్టణంలో ఎంతోమంది పేద ముస్లిం మహిళలు, ముఖ్యంగా భర్త లేక ఒంటరిగా ఉన్న వితంతు మహిళాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ వారికి భారంగా మారింది. కేవలం తాత్కాలిక సహాయం ఇస్తే సరిపోదు కాబట్టి వారు సొంత కాళ్లపై నిలబడేలా ఏదైనా శాశ్వత మార్గం చూపించాలి మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి గృహ ట్రైనింగ్ ల ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా ఏర్పాటు చేయాలన్నారు.
డా VS ముక్తియార్ మాట్లాడుతూ మన పేద ముస్లిం సోదరీమణుల కోసం కుటీర పరిశ్రమలలో (గృహ పరిశ్రమలు) కుట్టు మిషన్లు, హస్తకళలు, లేదా ఇంట్లోనే తయారుచేసే చిన్న చిన్న గృహ పరిశ్రమలపై వారికి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది. ఈ శిక్షణ పూర్తయ్యాక, ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల సహాయంతో లేదా స్వచ్ఛంద సంస్థల సహకారంతో వారికి అవసరమైన యంత్రాలు, రుణాలు ఇప్పించడం వల్ల గౌరవంగా తమ ఇంట్లోనే ఉంటూ ఆదాయం సంపాదించుకోగలరు.
ఈ విధంగా ఉపాధి చూపిస్తే సొంతంగా కుటుంబాలను పోషించుకుంటాం. పేద ముస్లిం కుటుంబాల అందరికీ చేయూతనివ్వడమే మనందరి బాధ్యత ఆర్థిక ఎదుగుదలకు పూర్తి సహకారం అందిస్తాం అని మైనార్టీ నాయకులకు తెలిపారు.... ఈ కార్యక్రమంలో ఖాజీ హబీబుల్లా, షాదక్, షభిర్, నజీర్, షాదీక్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




