Rayachoty: సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేయాలి మండిపల్లి

Rayachoty: రాయచోటిలో TDP కార్యకర్తల సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పిలుపు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 27 July 2026 10:32 PM IST
Rayachoty
X

Rayachoty: సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేయాలి మండిపల్లి

రాయచోటి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేసే బాధ్యత ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తపై ఉందని *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, రాయచోటి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అన్నారు.

రాయచోటి–మదనపల్లె రోడ్డులోని అజయ్ రెసిడెన్సీలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాయచోటి నియోజకవర్గ అబ్జర్వర్ అన్నా అనిత యాదవ్ పార్టీ నాయకులు మౌర్యా రెడ్డి తో కలిసి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రతి పథకం, ప్రతి అభివృద్ధి కార్యక్రమం గురించి ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు చేరుతున్నాయని ప్రజలకు వివరించడంతో పాటు, ప్రతి ఇంటిని ప్రత్యక్షంగా కలిసే డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి బూత్‌లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, బూత్ కమిటీలు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, గ్రామ అధ్యక్షులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలను తెలుసుకొని, పార్టీ పట్ల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు.

పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం అని, వారి కృషి, అంకితభావం, సమిష్టి కృషితోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయడం, ఎన్నికల వ్యూహాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా విజయాన్ని అందుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, డోర్-టు-డోర్ ప్రచారం, బూత్ స్థాయి బలోపేతం, గ్రామాల వారీగా బాధ్యతల కేటాయింపు, పార్టీ విస్తరణ, ప్రజలతో అనుసంధానం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, బూత్ మరియు క్లస్టర్ ఇన్‌చార్జిలు, గ్రామ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story