Proddatur: శరీరానికే వైకల్యం.. భక్తికి కాదని నిరూపిస్తున్న దివ్యాంగుడు!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు ఈశ్వర్ రెడ్డి నగర్‌లో దివ్యాంగుడైన మధు కళ్యాణ్ గత 15 ఏళ్లుగా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తూ స్థానికులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 15 Sept 2026 5:32 PM IST
Proddatur
X

Proddatur: శరీరానికే వైకల్యం.. భక్తికి కాదని నిరూపిస్తున్న దివ్యాంగుడు!

ప్రొద్దటూరు: పుట్టుకతోనే వికలాంగుడైనా.. స్వామివారిపై ఉన్న అపారమైన భక్తిశ్రద్ధలతో గత 15 సంవత్సరాలుగా ప్రొద్దుటూరు పట్టణంలో భక్తి, నిష్టకు నిలువెత్తు రూపంగా నిలుస్తున్నాడు కళ్యాణ్. శరీరానికి ఉన్న వికలాంగత్వం అతని నడకను మాత్రమే పరిమితం చేసింది కానీ, అతని సంకల్పాన్ని, స్వామివారిపై ఉన్న భక్తినైతే రవ్వంతైనా తగ్గించలేకపోయింది.

​గత 15 ఏళ్లగా వినాయక చవితి వస్తోందంటే చాలు... కళ్యాణ్ ఉత్సాహానికి హద్దులుండవు. తన వీధిలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసే బాధ్యతనంతా తానై దగ్గరుండి చూసుకుంటాడు. పూల అలంకరణల నుంచి కంటికి ఇంపుగా ఉండే విద్యుత్ కాంతుల (లైటింగ్) వరకు ప్రతీ విషయంలోనూ తన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాడు. అంగవైకల్యాన్ని జయించి, మండపం వద్ద నిరంతరం శ్రమిస్తూ అతడు చేసే హడావుడి వీధి ప్రజలందరినీ ఆకట్టుకుంటుంది.

​నవరాత్రుల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్వామివారికి నియమ నిష్టలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. కేవలం పూజలతోనే సరిపెట్టకుండా, భక్తిశ్రద్ధలతో ప్రతిరోజూ అన్నప్రసాదలు పంపిణి చేస్తుంటాడు. ​శారీరక పరిమితులు ఉన్నప్పటికీ, దైవ సేవలో కళ్యాణ్ చూపుతున్న ఈ అపారమైన భక్తి, నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

తన వీధిలో వినాయక నవరాత్రులను ఓ పండగలా కాకుండా, అంతా కలిసి జరుపుకునే ఒక వేడుకలా మలిచిన కళ్యాణ్ ప్రయత్నాన్ని స్థానికులంతా ఎంతో కొనియాడుతున్నారు.. మద్దిలేటి మధు కళ్యాణ్ ప్రతి రోజు విఘ్నేశ్వరుడి పూజలు నిర్వహించి, హారతి ఇవ్వడం, ఏర్పాట్లను పర్యవేక్షించడం ఈ వైభవానికి మూలస్తంభం.

పుట్టుకతోనే వికలాంగుడైన కళ్యాణ్ స్వామి పై ఉన్న భక్తితో గత 15 సంవత్సరాలు గా ఏ లోటూ రాకుండా తనే ముందుండి వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాడు.. తన తల్లిదండ్రులు తోబుట్టులు స్నేహితుల సహాయంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తాడు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR