Kadapa: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించాలి: కడప DEO

Kadapa: కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ స్మార్ట్ కిచెన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.షంషుద్దీన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 3 Aug 2026 5:31 PM IST
Kadapa
X

Kadapa: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించాలి: కడప DEO

కడప: దువ్వూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్.పి.హెచ్.ఎస్.) ప్రాంగణంలో కొనసాగుతున్న స్మార్ట్ కిచెన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.షంషుద్దీన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

​ఈ తనిఖీలో భాగంగా ఆయన పాఠశాల విద్యార్థుల కోసం సిద్ధం చేసిన మధ్యాహ్న భోజన నాణ్యతను, కూరలను స్వయంగా పరిశీలించారు. అలాగే వంటకం కోసం వినియోగిస్తున్న తాజా కూరగాయలు, దినుసులను తనిఖీ చేసి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

​అనంతరం DEO ఎస్.షంషుద్దీన్ మాట్లాడుతూ... ఈ స్మార్ట్ కిచెన్ ద్వారా మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు ప్రతిరోజూ భోజనం సరఫరా అవుతున్నందున, సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులకు అత్యంత నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని సరైన సమయానికి అందించాలని ఆదేశించారు. ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వంటశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దువ్వూరు స్మార్ట్ కిచెన్‌ను జిల్లాలోనే నంబర్ వన్ ఆదర్శవంతమైన కిచెన్‌గా తీర్చిదిద్దేందుకు సిబ్బంది అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కె. రమణయ్య, జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు ఎ. శ్రీనివాసులు, స్మార్ట్ కిచెన్ మేనేజర్, కంప్యూటర్ ఆపరేటర్ ఎం. శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story