Mydukur: ముత్రాయపల్లెలో ఘోరం.. భర్త చేతిలో భార్య దారుణ హత్య!
Mydukur: కడప జిల్లా మైదుకూరు మండలం ముత్రాయపల్లెలో కుటుంబ తగాదాల వల్ల భర్త ఎల్లయ్య చేతిలో భార్య సాలమ్మ (40) దారుణంగా హత్యకు గురైంది.
Mydukur: ముత్రాయపల్లెలో ఘోరం.. భర్త చేతిలో భార్య దారుణ హత్య!
మైదుకూరు: కడప జిల్లా మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్రాయపల్లె గ్రామంలో మంగళవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ తగదాల కారణంగా భర్త చేతిలో భార్య దారుణంగా హత్యకు గురైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముత్రాయపల్లె గ్రామానికి చెందిన దాదన్న గారి సాలమ్మ (40), ఆమె భర్త ఎల్లయ్య దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. జూలై 28న ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో ఇంటి వద్ద భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన భర్త ఎల్లయ్య, భార్య సాలమ్మ తలపై తీవ్రంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
మృతురాలికి ఒక కుమారుడు (శ్రీకర్ - 26), ఇద్దరు కుమార్తెలు (వర్షిత - 24, వైష్ణవి - 17) ఉన్నారు. సమాచారం అందుకున్న మైదుకూరు అర్బన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు c i రమణారెడ్డ్ తెలిపారు.




