Rayachoti: సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ ర్యాలీని జయప్రదం చేయండి: సీపీఐ

Rayachoti: కేంద్ర విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగే సీపీఐ 'బద్లావ్ జరూరీ హై' మహార్యాలీని జయప్రదం చేయాలని పి మహేష్ పిలుపు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 19 Aug 2026 9:47 PM IST
Rayachoti
X

Rayachoti: సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ ర్యాలీని జయప్రదం చేయండి: సీపీఐ

రాయచోటి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1 న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే "బద్లావ్ జరూరీ హై–మార్పు కావాలి" మహార్యాలీని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి మహేష్ పిలుపునిచ్చారు. రాయచోటి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని,సార్వత్రిక విద్య,వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలన్నారు.రైతు పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలని,బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలను పునరుద్ధరించి,ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని,ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉపాధి కల్పించడంతో పాటు మహిళా రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలన్నారు.

అలాగే కార్మికుల హక్కులను పరిరక్షించి,దళితులు,ఆదివాసులపై జరుగుతున్న దాడులు,అకృత్యాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.అలాగే సెప్టెంబర్ 1న జరిగే చలో ఢిల్లీ నిరసన కార్యక్రమానికి రాయచోటి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో కార్మికులు,కార్యకర్తలు,నిరుద్యోగులు,ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మర్రి సుమిత్ర,సీపీఐ పట్టణ కార్యదర్శి చుక్క జగన్‌బాబు,నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు పీ.కోటేశ్వరరావు,జక్కల వెంకటేష్,ఆంజనేయులు,కే.ఓబులేసు,వంగిమళ్ళ రంగారెడ్డి,కే.సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story