Kadapa: కడపలో బుగ్గవంక బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ ధర్నా!

Kadapa: కడప నగరంలో షామీరీయ మసీదు సమీపంలో బుగ్గవంక బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్.. ధర్నా నిర్వహణ.

G. RAVI KUMAR, KADAPA
Published on: 15 Sept 2026 3:21 PM IST
Kadapa
X

Kadapa: కడపలో బుగ్గవంక బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ ధర్నా!

Kadapa: కడప నగరంలోని షామీరీయ మసీదు సమీపంలో బుగ్గవంకపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. బ్రిడ్జి నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం జాప్యాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.

కడప ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు రవీంద్రనగర్ గుర్రాలగడ్డ సమీపంలోని బుగ్గవంకపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ కడప ఇంచార్జ్ బండి జకరయ్య డిమాండ్ చేశారు. కడప నగరం అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని అన్నారు.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు కడప అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్ సత్తార్, హమీద్,కమాల్ భాష తదితరులు పాల్గొన్నారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA