Chinnamandem: ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నిశాంత్ కుమార్

Chinnamandem: రాయచోటి నియోజకవర్గం చిన్నమండెంలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను పరిశీలించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 22 Aug 2026 4:44 PM IST
Chinnamandem
X

Chinnamandem: ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నిశాంత్ కుమార్

చిన్నమండెం: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాయచోటి నియోజకవర్గం లోని చిన్నమండెం మండలంలోని ఉర్దూ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న SIR ప్రక్రియ, ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పోలింగ్ కేంద్రం పరిధిలోని పోలింగ్ స్టేషన్ కేసులు వివరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆయా కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేయడం, నోటీసుల అనంతరం నిర్వహించిన హియరింగ్‌కు హాజరైన వారి వివరాలపై ఆరా తీశారు.

హియరింగ్‌కు హాజరుకాని ఓటర్ల విషయంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా, ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

SIR ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత తహసీల్దార్ రామాంజనేయులు, ఎన్నికల శాఖ అధికారులు, ఎంపీడీవో శ్రీధర్ రెడ్డి,బూత్ లెవల్ అధికారులు (BLOలు) తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story