Rayachoty: ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత: అన్నమయ్య జిల్లా కలెక్టర్!

Rayachoty: రాయచోటిలోని ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ నిశాంత్ కుమార్ తనిఖీ చేశారు. గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 25 Aug 2026 5:44 PM IST
Rayachoty
X

Rayachoty: ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత: అన్నమయ్య జిల్లా కలెక్టర్!

రాయచోటి: ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మాసవారీ తనిఖీల్లో భాగంగా రాయచోటి పట్టణం మార్కెట్ యార్డ్ లో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ లో అంతర్భాగాలను రాజకీయ పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాలు బియులు, సియూలు, వివి ప్యాట్ లను, అక్కడి భద్రతా చర్యలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డిఓ ఏ. శ్రీనివాస్,ఎలక్షన్ విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story