Veeraballi: ఓదివీడులో శ్రీరాముల వారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ!

Veeraballi: వీరబల్లి మండలం ఓదివీడులో శ్రీరాముల వారి ఆలయ నిర్మాణానికి రాజంపేట టీడీపీ ఇన్‌చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు భూమిపూజ చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 6 Sept 2026 1:36 PM IST
Veeraballi
X

Veeraballi: ఓదివీడులో శ్రీరాముల వారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ!

Veeraballi: మండలంలోని ఓదివీడు గ్రామం దూల్ల హరిజనవాడలో శ్రీరాముల వారి ఆలయ నిర్మాణానికి రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

ఆలయ నిర్మాణం కోసం సోదరులు జగిలి ఆదినారాయణ, జగిలి రాచరాయుడు తమ కుటుంబ సభ్యుల సహకారంతో స్థలాన్ని దానం చేయడం అభినందనీయమని చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆలయంలో విగ్రహాల ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చిన స్థలదాతలను ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా చమర్తి జగన్మోహన్ రాజు స్థానిక ప్రజలతో కలిసి, హరిజనవాడ ప్రజలతో సమానంగా నేలపై కూర్చొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరితో కలిసిమెలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

తమ గ్రామంలో శ్రీరాముల వారి ఆలయ నిర్మాణానికి స్థలాన్ని దానం చేసి సహకరిస్తున్న జగిలి ఆదినారాయణ, జగిలి రాచరాయుడు కుటుంబ సభ్యులకు, అలాగే ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న చమర్తి జగన్మోహన్ రాజుకు దూల్ల హరిజనవాడ ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థలదాతలు, ఓదివీడు గ్రామ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దూల్ల హరిజనవాడ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story