Sundupalli: సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి ₹38 లక్షల నిధులు మంజూరు!
Sundupalli: సుండుపల్లి కార్తికేయ నగర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ప్రహరీ గోడకు ₹38 లక్షలు మంజూరు. రాజంపేట టిడిపి ఇన్‌ఛార్జ్ చమర్తికి గ్రామస్తుల సన్మానం.
Sundupalli: సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి ₹38 లక్షల నిధులు మంజూరు!
Sundupalli: సుండుపల్లి మండల కేంద్రంలోని కార్తికేయ నగర్‌లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన నిర్మాణంతో పాటు ప్రహరీ గోడ ఏర్పాటుకు ₹38 లక్షల నిధులు మంజూరు చేయించినందుకు గాను, నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారిని కాలనీవాసులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
గతంలో కార్తికేయ నగర్ వాసులు ఆలయ నిర్మాణం ఆవశ్యకతను జగన్మోహన్ రాజు గారి దృష్టికి తీసుకువెళ్లి వినతిపత్రం అందజేశారు. వారి విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఆయన, ఉన్నతాధికారులతో మాట్లాడి ఆలయ నిర్మాణం మరియు రక్షణ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు గాను మొత్తం ₹38 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు.
దీంతో హర్షం వ్యక్తం చేసిన స్థానికులు, ఆయనను కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రాంత చిరకాల వాంఛను నెరవేర్చినందుకు కాలనీవాసులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కార్తికేయ నగర్ ప్రముఖులు, కాలనీవాసులు మరియు భక్తులు పాల్గొన్నారు.




