Kadapa: బ్రహ్మంగారిమఠం మేనేజర్ నియామకంలో తీవ్ర ఉత్కంఠ రోజుకో మలుపు!

Kadapa: బ్రహ్మంగారిమఠం మేనేజర్ నియామకంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రిటైర్డ్ మేనేజర్ ఈశ్వరచారి కొనసాగింపునకు పీఠాధిపతి ప్రతిపాదనలపై ఎండోమెంట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 10 Aug 2026 9:39 AM IST
Kadapa
X

Kadapa: బ్రహ్మంగారిమఠం మేనేజర్ నియామకంలో తీవ్ర ఉత్కంఠ రోజుకో మలుపు!

Kadapa: ప్రముఖ పుణ్యక్షేత్రం విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం పదవులు రోజుకో మలుపు..

కొద్ది నెలల వరకు పీఠాధిపతి నియామకం అనేక మలుపు లు.

అనంతరం మొదలైన మేనేజర్ నియామకం సైతం అనేక మలుపులు తిరుగుతుంది, పూర్వపు మేనేజరూ ఈశ్వర చారి పదవి విరమణ తో మేనేజర్ గా బాధ్యతలు చేపట్టిన పిపిఎన్ ప్రసాద్,కేవలం ఒక్క రోజులోనే పదవి పోయిన సందర్భం తో ఖాళీగా మేనేజర్ స్థానం.

నేడు మళ్ళీమఠం మేనేజర్ గా పదవీ విరమణ పొందిన ఈశ్వర చారిని కొనసాగించేందుకు పీఠాధిపతి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది,నూతన మేనేజర్ను నియమించుకునేందుకు సమస్యలు ఉండడంతో ఈశ్వర చారిని కొనసాగించాలని మఠాధిపతి ఎండోమెంట్ కమిషనర్ కు ప్రతిపాదనలు పంపారు.

ఆ విధంగా కుదరని పక్షంలో శంకర్ బాలాజీ గారిని ఇన్చార్జ్ మేనేజర్ గా కొనసాగించే అవకాశం ఉందంటున్నా ఎండోమెంట్ వర్గాలు, డిప్యూటీ మేనేజర్ గా దత్తాత్రేయ స్వామిని నియమించి పరిపాలనసాగించే అవకాశం ఉందంటున్నా స్థానికులు.

ప్రస్తుతం బ్రహ్మంగారిమఠం శరవేగంగా అభివృద్ధి జరగాల్సిన ఆవశ్యకత ఉన్న సందర్భంలో ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండకపోలేదు,ప్రస్తుత తాత్కాలిక పీఠాధిపతి వెంకటాద్రి స్వామిని సైతం శాశ్వత మఠాధిపతిగా నియమించే అవకాశం ఉందంటున్నా స్థానికులు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story