Rayachoti: సుగవాసి ప్రసాద్ బాబుకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్!

Rayachoti: రాయచోటిలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబుకు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 28 Aug 2026 2:35 PM IST
Rayachoti
X

Rayachoti: సుగవాసి ప్రసాద్ బాబుకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్!

Rayachoti: రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని బ్రహ్మ కుమారీస్ వారు ఆత్మీయంగా కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారు బ్రహ్మ కుమారీస్ వారిని ఆప్యాయంగా అభినందించి, అక్కా–తమ్ముడు, అన్నా–చెల్లెలి మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధాలకు ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని పేర్కొన్నారు.

రాఖీ కట్టిన బ్రహ్మ కుమారీస్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమాజంలో సోదరభావం, ప్రేమానురాగాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. ప్రతి ఆడబిడ్డకు అండగా నిలిచి, వారి సంతోషం, భద్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు సాగాలని కోరారు.

ఈ పవిత్రమైన రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లందరికీ, ఆడబిడ్డలందరికీ హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story