Kadapa: పెద్ద దర్గాను దర్శించుకున్న సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్!
Kadapa: కడప జిల్లా గండికోటలో ‘హైందవ’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కడపలోని అమీన్ పీర్ పెద్ద దర్గాను సందర్శించి ప్రార్థనలు చేశారు
Kadapa: పెద్ద దర్గాను దర్శించుకున్న సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్!
కడప: ప్రస్తుతం ‘హైందవ’ సినిమా షూటింగ్ కోసం కడప జిల్లాలో ఉన్న ప్రముఖ సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కడపలోని అమీన్ పీర్ పెద్ద దర్గాను సందర్శించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. హైందవ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం కడప జిల్లాలోని గండికోట పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్రీకరణలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కడప నగరంలోని అమీన్ పీర్ పెద్ద దర్గాను సందర్శించారు.
దర్గా నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా సంప్రదాయం ప్రకారం ఆశీర్వాదాలు అందజేశారు. దర్గాను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మనస్సు ప్రశాంతంగా ఉందని మరోసారి వచ్చి దర్గాను దర్శించుకుంటారని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం గండికోటలో జరుగుతున్న ‘హైందవ’ సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నారు.




