Kadapa: కడపలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్య్ర వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డి.
Kadapa: కడపలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు!
Kadapa: స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో శనివారం ఉదయం 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖామంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసి డా. నిధీ మీనా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉదయం 9.00గం లకు వందేమాతరం గీతాలాపన అనంతరం రాష్ట్ర మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్రీయ సెల్యూట్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ లతో కలిసి మైదానంలో పటాలాలను పరిశీలించారు.
వివిధ ప్లాటూన్లు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం జిల్లాలో చేపట్టి, అమలు చేస్తున్న అభివృద్ధి. సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు రాష్ట్ర మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి వివరించారు.




