Rayachoti: 5 రోజుల పని దినాల కోసం రాయచోటిలో బ్యాంకర్ల పోరు!

Rayachoti: రాయచోటి ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద బ్యాంకు ఉద్యోగుల ధర్నా.. ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని యూఎఫ్‌బీయూ డిమాండ్, సీఐటీయూ మద్దతు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 11 Sept 2026 2:27 PM IST
Rayachoti
X

Rayachoti: 5 రోజుల పని దినాల కోసం రాయచోటిలో బ్యాంకర్ల పోరు!

Rayachoti: బ్యాంకింగ్ రంగంలో 5 రోజుల పనిదినాల విధానం అమలు చేయడంతో పాటు ఉద్యోగుల పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో భాగంగా రాయచోటిలో నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా రాయచోటి ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రాయచోటి లోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన బ్యాంకు ఉద్యోగులు మరియు సిఐటియు నాయకులు కూడా పాల్గోని మద్దతుటెలిపారు .తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు నినాదాలు చేశారు.

బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా పలు బ్యాంకుల్లో సాధారణ సేవలకు అంతరాయం ఏర్పడింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI