Madanapalle: సదరం' సర్టిఫికెట్ల సమస్యల తక్షణ పరిష్కారానికి BYS డిమాండ్

Madanapalle: సదరం సర్టిఫికెట్ల జాప్యంపై డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీ నరసయ్యకు బహుజన యువసేన వినతిపత్రం ఇచ్చి, ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ పెట్టాలని డిమాండ్ చేసింది.

Srinivasulu, Madanapalle
Published on: 28 July 2026 4:20 PM IST
Madanapalle
X

Madanapalle: సదరం' సర్టిఫికెట్ల సమస్యల తక్షణ పరిష్కారానికి BYS డిమాండ్

మదనపల్లె, జూలై 28: అన్నమయ్య జిల్లాలో సదరం (SADAREM) వైకల్య ధ్రువీకరణ పత్రాల జారీలో నెలకొన్న సాంకేతిక సమస్యలు, స్లాట్ బుకింగ్ ఇబ్బందులు, సర్టిఫికెట్ల జాప్యాన్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షులు పునీత్ కుమార్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో) డా. లక్ష్మీ నరసయ్యకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడుతూ, సర్వర్ లోపాలు, డిజిటల్ సంతకాల జాప్యం కారణంగా అర్హులైన దివ్యాంగులు నెలల తరబడి సదరం సర్టిఫికెట్ల కోసం నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దివ్యాంగుల పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక సదరం శిబిరాలు నిర్వహించాలని, సర్వర్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని, సర్టిఫికెట్లను వెంటనే ఆన్‌లైన్‌లో జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల హక్కులను పరిరక్షించే దిశగా జిల్లా యంత్రాంగం అత్యవసరంగా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని బహుజన యువసేన తరఫున పునీత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story