Badvel: బద్వేలు సబ్ రిజిస్ట్రార్ విద్యాసాగర్ రెడ్డి సస్పెన్షన్!

Badvel: బద్వేలు సబ్ రిజిస్ట్రార్ విద్యాసాగర్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ భూములు, అగ్రిగోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలతో ఈ చర్యలు తీసుకుంది.

B. ARUN KUMAR, BADVEL
Published on: 3 Sept 2026 5:35 PM IST
Badvel
X

Badvel: బద్వేలు సబ్ రిజిస్ట్రార్ విద్యాసాగర్ రెడ్డి సస్పెన్షన్!

Badvel: ఇటీవల బద్వేలు పరిధిలో ప్రభుత్వ భూములను ప్రయివేటు వ్యక్తులకు రిజిస్త్రేషన్ చేసిన బద్వేలు సబ్ రిజిస్టర్ విద్యాసాగర్ రెడ్డి. ప్రొద్దుటూరు లో హైకోర్టు అటాచ్మెంట్ ఉన్న అగ్రిగోల్డ్ భూమిని 2021లో ప్రయివేటు వ్యక్తులకు రిజిస్టర్ చేసిన సబ్ రిజిస్టర్. అలాగే తన సమీప బంధువైన ఓ ప్రైవేటు వ్యక్తిని డాక్యుమెంట్ రైటర్ గా నియమించుకొని తన ద్వారా అక్రమ రిజిస్టర్లకు పాల్పడుతూ సదరు వ్యక్తితో కుమ్మక్కై వాటాలు పంచుకునేవాడని సమాచారం.

ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో సబ్ రిజిస్టర్ ,మరో 9 మందిపై సిఐడి పిర్యాదు మేరకు కేసు నమోదు. ఇటీవల వరుసగా అవినీతి ఆరోపణలు ఎదురుకొంటున్న సబ్ రిజిస్టర్ విద్యాసాగర్ రెడ్డి. విద్యాసాగర్ రెడ్డి పై విచారణ చేపట్టిన జిల్లా అధికారులు.

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తిష్ట వేసి కూర్చున్న ప్రయివేటు డాక్యుమెంట్ రైటర్లు. కొంత మంది డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సబ్ రిజిస్టర్ పై ఆరోపణలు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story