Badvel: బద్వేల్‌లో విజయవంతమైన విద్యాసంస్థల బంద్
Badvel: నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ బద్వేల్‌లో వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగిన విద్యాసంస్థల బంద్.
Badvel: బద్వేల్‌లో విజయవంతమైన విద్యాసంస్థల బంద్
బద్వేల్: నీట్ పేపర్ లీకేజీ పై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అదేవిధంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ లో విద్యార్థుల శాంతియుత నిరసనలో పోలీసుల దాడి లపై రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ లో భాగంగా బద్వేల్ పట్టణంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బంద్ విజయవంతం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చెన్ని ఏఐఎస్ఎ జిల్లా కన్వీనర్ బండి అనిల్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాల సుమంత్ లు మాట్లాడుతూ
నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జులై 24న వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ బద్వేలు పట్టణంలో విజయవంతం చేయడం జరిగింది. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో దేశవ్యాప్తంగా 89 సార్లు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి
కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర విద్యా శాఖ మంత్రి ఇప్పటివరకు ఈ అంశంపై స్పందించలేదు. వరుస పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తే, నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారు. నీట్ లీకేజ్ వల్ల దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత 22 రోజులుగా సోనం వాంగ్ చుక్ అనే శాస్త్రవేత్త విద్యార్థుల సమస్యల పైన నీట్ పేపర్ లీకేజీలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటే ఉన్నఫలంగా ముందస్తు సమాచారం లేకుండా ఆయనను అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించడం జరిగింది . సోనము వాంగ్చుక్ ఆసుపత్రిలో కూడా తన దీక్షను కొనసాగించడం జరుగుతుంది.
విద్యార్థులు జులై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ కి చేరుకొని మీఆవేదనను తెలపండి అని ఆయన పిలుపు ఇస్తే దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఢిల్లీలోని జంతర్ మంతర్ కి చేరుకోవాలని ప్రయత్నిస్తే చుట్టూ మూడు కిలోమీటర్ల మేర ఆంక్షలు విధిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే అయినా విద్యార్థులు ఏమాత్రం బెదరకుండా లక్షల మంది యువత జంతర్మంతర్ కి చేరుకోవడం జరిగింది.
దీనిని భరించలేని మోడీ సర్కార్ విద్యార్థులపై పోలీసులతో పోలీసుల ముసుగులో ఆర్ఎస్ఎస్ బిజెపి గుండాలతో విచక్షణ రహితంగా విద్యార్థులపై దాడి చేయించడం జరిగింది . ఈ దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు మేధావులు, సినితారలు సైతం గళం విప్పుతుంటే తెలుగు రాష్ట్రాల పాలక, ప్రతిపక్ష పార్టీలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పాలక ప్రతిపక్ష పార్టీలు బిజెపికి కొమ్ము కాస్తూ విద్యార్థులను నిరుద్యోగులను గాలికి వదిలేశారు
బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్ లో బాబు-జగన్-పవన్ అని ఇప్పుడు అర్థమవుతోంది. విద్యార్థుల పక్షాన నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తొత్తుగా మారి అక్రమ అరెస్టులు చేయిస్తోంది" అని నాయకులు విమర్శించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిరుద్యోగ యువత పట్ల నిరంకుశ వైఖరిని విడనాడి విద్యార్థులకు నిరుద్యోగ యువతకు అండగా నిలవాలని వారు కోరారు.
తక్షణమేకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే నీట్ పేపర్ లీకేజీ కి కారణం కారకులైన వారిపై చర్యలు తీసుకొని అరెస్టు అరెస్టు చేయాలని, జంతర్ మంతర్ లో అరెస్టు చేసిన విద్యార్థులను విద్యార్థి సంఘ నాయకులను వెంటనే విడుదల విడుదల చేయాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ కు సిపిఐ, కేవీపీస్ సంపూర్ణ మద్దతు
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బండి జకరయ్య, సిపిఐ బద్వేల్ పట్టణ కార్యదర్శి పెద్దలపల్లి బాలు, ఏరియా సహాయ కార్యదర్శులు ఏరియా సహాయ కార్యదర్శులు ఇమ్మానుయేల్ పివి రమణ జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రశాంత్ సుమంతు సురేంద్ర,డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్ ఎస్ కే ఆదిల్ పట్టణ రూరల్ అధ్యక్షులు ముడమాల ఓబుల్ రెడ్డి ఉపాధ్యక్షులు సుధాకర్ యువరాజ్ నాగేంద్ర సహాయ కార్యదర్శి ప్రసాద్ రెడ్డి నరసింహ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి నవీన్ పట్టణ నాయకులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.




