Badvel: బద్వేల్‌లో అన్నదమ్ములపై కత్తితో దాడి ఇద్దరికీ తీవ్ర గాయాలు!
Badvel: బద్వేల్ గుంతపల్లి క్రాస్ వద్ద అన్నదమ్ములపై కత్తితో దాడి చేసిన యశ్వంత్. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కడప రిమ్స్‌కు తరలింపు, కేసు నమోదు చేసిన పోలీసులు.
Badvel: బద్వేల్‌లో అన్నదమ్ములపై కత్తితో దాడి ఇద్దరికీ తీవ్ర గాయాలు!
Badvel: కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని భవ నారాయణ నగర్ కు చెందిన నడిపి కొండయ్య, నాగేశ్వరి, కుమారులు వెంకట మదన్ దినేష్ లను, యశ్వంత్ అనే యువకుడు నెల క్రితం స్కూటీ విషయంలో చిన్నపాటి ఘర్షణ జరగడంతో దాని గురించి మాట్లాడుకుందాం రా అని గుంతపల్లి క్రాస్ రోడ్ లోకి పిలిపించి అక్కడ మాట మాట పెరగడంతో యశ్వంత్ అనే యువకుడు , దినేష్, వెంకట మదన్ లపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు, ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దాడిలో గాయ పడిన వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు.
ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గణేష్ ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముందే బద్వేల్ అర్బన్ సీఐ రామకృష్ణ పండగ దినాలలో ఎటువంటి ఘర్షణలు అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని అట్లు ఏవైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ బద్వేల్ పట్టణంలోని కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు జరగటంతో నిందితులపై కఠిన చర్యలు తప్పవని సిఐ రామకృష్ణ హెచ్చరించారు.




