Badvel: మానవాభివృద్ధి సూచిక అసమానతల్లో భారత్‌కు 129వ స్థానం: సీపీఎం!

Badvel: ప్రపంచ మానవాభివృద్ధి సూచిక అసమానతల్లో భారత్ 129వ స్థానానికి పడిపోయిందని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ విమర్శించారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 6 Sept 2026 6:48 PM IST
Badvel
X

Badvel: మానవాభివృద్ధి సూచిక అసమానతల్లో భారత్‌కు 129వ స్థానం: సీపీఎం!

Badvel: మానవాభివృద్ధి సూచిక అసమానతల్లో 129వ స్థానంలోకి భారత్,రూపాయి పతనానికి ప్రభుత్వాలు డాలర్ను తలకెత్తుకోవడమే కారణం. కార్పొరేట్ల లాభాల కోసం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు క్విట్ ప్రోకో పద్ధతిలో పనిచేస్తున్నాయి.

ప్రజల్లో తిరోగమన భావాలు ప్రచారం చేస్తున్న ప్రభుత్వాల విధానాలు. దేవుడు అందరికీ దేవుడే అని చెప్పిన భక్తి ఉద్యమాలు విస్మరించిన బిజెపి ప్రభుత్వం. ఫ్యూడల్ దోపిడీ శక్తుల మోడల్ చట్టం మనుధర్మ శాస్త్రం తెచ్చిందే కులం. కులం,మతం,ప్రాంతం,బాష, ఆధారంగా పాలన దేశసమైక్యత, సమగ్రతలకు ప్రమాదం.

స్థానిక సంస్థలకు నిధులు కేటాయించి ఎన్నికల జరపాలి.ప్రజా రంగాల్లో ఖర్చు తగ్గించి, ప్రజలపై భారాలు వేస్తున్నారు. విద్యా, వైద్య రంగాల నుండి ప్రభుత్వాలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. 50 శాతం ఉన్న మహిళలు పార్లమెంటులో 10 శాతానికి మించి అడుగుపెట్టలేదు. పేదరిక నిర్మూలన పథకాలు నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు.పట్టణాల్లో స్వయం ఉపాధి, మురికివాడల అభివృద్ధి నిధి ఏర్పాటు చేయాలి. వామపక్షాల బలమైన ఉమ్మడి ప్రజా ప్రతిఘటన ఉద్యమాలే పరిష్కారాలు.

సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్...

2026 సెప్టెంబర్ ఆరవ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు, బద్వేలు స్థానిక పెన్షన్ అసోసియేషన్ మీటింగ్ హాల్ నందు బద్వేలు పట్టణ ప్రజా సంఘాల సమావేశం కన్వీనర్ కే.శీను అధ్యక్షతన "శాస్త్రీయ రాజకీయ శిక్షణ తరగతులు" జరిగాయి. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.చాంద్ బాషా, మహిళా సంఘం నాయకురాలు మోక్షమ్మ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం.చిన్ని వివిధ ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శిక్షణా తరగతులకు హాజరైన విద్యార్థులు, యువకులు, కార్మికులు,కర్షకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, విభిన్న వంతులు, చేతి వృత్తిదా రులు, మహిళా నాయకులు, ఆవాజు, కెవిపిఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ రాశులకు హాజరైన వారి నిర్దేశించి మాట్లాడుతూ... ప్రపంచ మానవాభివృద్ధి సూచిక సర్వేలు భారతదేశం అసమానతల్లో 129వ స్థానానికి పడిపోయిందన్నారు. దేశంలో రూపాయి విలువ పతనానికి, నిత్యవసర వస్తువుల ధరలు పెరగడానికి, కేంద్రంలోని బిజెపి ఎన్.డి.ఏ. ప్రభుత్వాలు డాలర్ను తలకెత్తుకోవడమే కారణమన్నారు. దేశ సంపదను కార్పొరేట్ల లాభాల కోసం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు.

నేడు దేశ ప్రజల్లో హీరోగమన భావాలు ప్రచారం చేస్తున్న ప్రభుత్వ విధానాలు నడుస్తున్నాయన్నారు. దేవుడు అందరికీ దేవుడే అని చెప్పిన భక్తి ఉత్సవాలు విస్మరించిన బిజెపి ప్రభుత్వం మైనార్టీలపై విషం చిమ్ముతోందని తెలిపారు. కులం, మతం, ప్రాంతం, భాష, ఆధారంగా పాలన దేశ సమైక్యత, సమగ్రతలకు ప్రమాదం అని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు భారత రాజ్యాంగ సవరణ 73, 74, ప్రకారం జరగాలని తెలిపారు. పంచాయితీలకు నిధులు, విధులు లేకుండా చేసి నిర్వీర్యం చేస్తున్నారన్నారు.

ప్రజల విద్యా, వైద్య ప్రజా రంగాల్లో ఖర్చు తగ్గించి, ప్రజలపై భారాలు వేస్తున్నారని అన్నారు. 50 శాతం గా ఉన్న మహిళల పార్లమెంటు ప్రాతినిధ్యం 78 వేల స్వాతంత్రంలో 10 శాతానికి మించలేదని తెలిపారు. పట్టణాల్లో స్వయం ఉపాధి మురికివాడల అభివృద్ధికి నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వామపక్షాల బలమైన ఉమ్మడి ప్రజా ప్రతిఘటన ఉద్యమాలే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలని తెలిపారు. భూస్వామ్య వ్యవస్థలో దోపిడీ శక్తుల మోడల్ చట్టం మనుధర్మ శాస్త్రం తెచ్చిందే కులమని వారన్నారు.

పేదరిక నిర్మూలన పథకాలు పాలక ప్రభుత్వాలే రద్దు చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ఇ.రమణయ్య, మున్సిపల్ నాయకులు నాగేంద్రబాబు, శివ, కాంట్రాక్ట్ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి కొండయ్య, స్కీం వర్కర్ల నాయకురాలు సుభాషిని, విజయమ్మ, లీలావతి, మహిళా సంఘం నాయకురాలు బాలమ్మ, మస్తాన్ బి, సుబ్బలక్ష్మి,

సావిత్రి, స్వప్న, మార్తమ్మ, రజక ఉతిదారుల సంఘం నాయకులు సుబ్బరాయుడు, శ్రీనివాసులు, శౌరి వాయిద్య కళాకారుల సంఘం నాయకులు సుబ్బరాయుడు, శివకృష్ణ, విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మోరా ప్రసాదు, వెంకటపతి, వెంకటేశ్వర్లు, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు పెద్ద ఓబయ్య, వెంకటేశ్వర్లు మద్దయ్య లక్ష్మయ్య తిరుపతి రామయ్య, కెవిపిఎస్ నాయకులు జకరయ్య, రాయప్ప, వెల్డింగ్ వర్కర్స్ నాయకులు మల్లికార్జున కార్పెంటర్స్ సంఘం నాయకులు దస్తగిరి ఆవాజ్ నాయకులు అన్వర్ భాష, మస్తాన్, హబీబుల్లా తదితరులు పాల్గొన్నారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story