Badvel: మహబూబ్ నగర్ కాలనీలో బేటీ బచావో - బేటీ పడావో సదస్సు

Badvel: కడప ఐసిడిఎస్ పరిధిలో ఘనంగా బేటీ బచావో-బేటీ పడావో. చైల్డ్ హెల్ప్ లైన్ 1098, బాలల హక్కులపై అవగాహన కల్పించిన సీడీపీవో శ్రీదేవి.

B. ARUN KUMAR, BADVEL
Published on: 30 July 2026 6:22 PM IST
Badvel
X

Badvel: మహబూబ్ నగర్ కాలనీలో బేటీ బచావో - బేటీ పడావో సదస్సు

బద్వేల్: మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు కడప ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని మహబూబ్ నగర్ కాలనీ ఉర్దూ పాఠశాల నందు అంగన్వాడీ టీచర్ షేక్ హసీనా ఆధ్వర్యంలో "బేటీ బచావో - బేటీ పడావో" అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీడీపీవో (సీడీపీఓ ) శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థినులకు బాలల పరిరక్షణ చట్టాలు, చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098 వినియోగం, మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అందుతున్న వివిధ సంక్షేమ పథకాలు, సేవల గురించి విస్తృతంగా వివరించారు. విద్యార్థులు మంచి ప్రవర్తన, అలవాట్లను అలవర్చుకోవాలని, సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన కలిగి ఉంటూ చదువుపై శ్రద్ధ, ఆసక్తి, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మహబూబ్ నగర్ కాలనీ పరిధిలో అంగన్వాడీ వర్కర్ షేక్ హసీనా అందిస్తున్న విశేష సేవలను, విధుల్లో ఆమె చూపిస్తున్న నిబద్ధతను సీడీపీవో శ్రీదేవి గారు ప్రత్యేకంగా కొనియాడి, అభినందించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ అరుణ, అంగన్వాడీ వర్కర్లు షేక్ హసీనా, షాభిరుణ్, లక్ష్మి నరసమ్మ, శైలజ, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story