Mydukur: మైదుకూరులో మౌలిక వసతుల కరవు: అధికారులపై ఏవీ రమణ ఆగ్రహం

Mydukur: మైదుకూరులో మౌలిక వసతుల కల్పనలో అధికారులు విఫలమయ్యారని రైతు సేవాసమితి అధ్యక్షుడు ఏవీ రమణ మండిపడ్డారు. డ్రైనేజ్, రోడ్లపై హెచ్చరించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 8 Aug 2026 11:50 AM IST
Mydukur
X

Mydukur: మైదుకూరులో మౌలిక వసతుల కరవు: అధికారులపై ఏవీ రమణ ఆగ్రహం

మైదుకూరు మున్సిపల్ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు దారుణం.

మైదుకూరు: పట్టణo గ్రామపంచాయతీ నుండి మున్సిపల్ గా మారి 14 గుసంవత్సరాల అవుతున్న ప్రజలకు పన్నుల భారం అయితే పెరిగింది తప్ప మౌలిక వసతులు గ్రామపంచాయతీ కన్నా దారుణంగా ఉన్నాయని రైతు సేవాసమితి అధ్యక్షుడు ఏవి.రమణ అన్నారు. ఈరోజు మైదుకూరు పట్టణం కడప రోడ్డులోని శారదా విద్యా మందిర్ స్కూల్ వీధిలోరోడ్డు తవ్వి ఆరు నెలలు అవుతున్న తవ్విన రోడ్డు మరమత్తు చేయకపోవడంతో వీధి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రమణ అన్నారు. అలాగే మైదుకూరు పట్టణంలోని ప్రధాన రోడ్డు అయినా కడప రోడ్డు డ్రైనేజ్ నుండి తారురోడ్డు వరకు 15 నుండి 20 అడుగులు ప్రధాన రోడ్డు ఆక్రమించి ట్రాఫిక్ పరంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మున్సిపల్ అధికారులు కేవలం ఉదయం పూట కసువు క్లీన్ చేసేదానికే పరిమితం కావడం మరి దారుణమని వారం రోజులుగా మైదుకూరు పట్టణంలోని డివిజన్లో డ్రైనేజ్ మురికినీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండడంతో దోమలు, చీటీఈగలు, కుక్కలతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమస్యల పై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించకపోతే రైతు సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సేవాసమితి మైదుకూరు పట్టణ అధ్యక్షుడు రామ్మోహన్, చాకలి సుబ్బయ్య, యల్లాల రామచంద్రుడు, గుజ్జుల లక్ష్మయ్య, దేవిశెట్టి సుబ్రహ్మణ్యం, టైలర్ హరి, లక్ష్మీ దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story