Madanapalle: విద్యా, రాజకీయాల్లో డాక్టర్ సేతు సేవలు స్ఫూర్తిదాయకం!

Madanapalle: బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా నియమితులైన డాక్టర్ ఎన్. సేతును మదనపల్లెలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ నేతలు ఘనంగా సన్మానించారు.

Srinivasulu, Madanapalle
Published on: 17 Aug 2026 6:36 PM IST
Madanapalle
X

Madanapalle: విద్యా, రాజకీయాల్లో డాక్టర్ సేతు సేవలు స్ఫూర్తిదాయకం!

మదనపల్లె: మదనపల్లె విద్యా,రాజకీయ రంగాలలో డాక్టర్ ఎన్.సేతు సేవలు స్ఫూర్తిదాయకమని ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు పేర్కొన్నారు.బీజేపి రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా నియమితులైన శుభసందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం విజయభారతి పాఠశాల ఆవరణంలో బిజెపి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డితోకలిసి శాలువాలు,తలపాగ,గజమాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యారంగంలో సుదీర్ఘ సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.విజయభారతి విద్యాసంస్థల ద్వారా నాణ్యమైన విద్యాబోధన అందిస్తూ పాత్రికేయుల పిల్లలకు ఉచిత విద్యను అందించడం కాకుండా పాత్రికేయుల సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తున్నారని కొనియాడారు.

భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఆయన విశేష సేవలు అందిస్తున్నారని,ఆయన సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం రాష్ట్ర కమిటీలో చోటు కల్పించిండం శివ పరిణామమన్నారు.అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ రాజకీయాలలో అజాతశత్రువుగా ప్రసిద్ధిగాంచారని ప్రశంసించారు.భవిష్యత్తు రాజకీయాలలో బిజెపిలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించాలని,మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story