Mydukur: విద్యుత్ ఉద్యోగుల పోరాటం ఫలించింది.. 3 డీఏలు విడుదల!

Mydukur: ఏపీలో విద్యుత్ ఉద్యోగుల ఐక్య పోరాటం ఫలించింది. యాజమాన్యం 3 పెండింగ్ డీఏలను విడుదల చేయడంపై విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 7 Sept 2026 5:55 PM IST
Mydukur
X

Mydukur: విద్యుత్ ఉద్యోగుల పోరాటం ఫలించింది.. 3 డీఏలు విడుదల!

మైదుకూరు: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన ఐక్య పోరాటం ఫలించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 3 డీఏ (DA) లను విద్యుత్ యాజమాన్యం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ స్వాగతించింది. సోమవారం సాయంత్రం దువ్వూరులోని సి.వి.వి. కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నాయబ్ రసూల్, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షులు బి.ఎన్. నాగసుబ్బయ్య, డిస్కం ఉపాధ్యక్షులు శీలం సుబ్బరాయుడు వివరాలు వెల్లడించారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యాజమాన్య మొండివైఖరికి వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన 'చలో తిరుపతి', 'చలో విజయవాడ' కార్యక్రమాలకు లభించిన విశేష స్పందనే యాజమాన్యం దిగిరావడానికి కారణమని పేర్కొన్నారు. కార్మికుల ఐక్యత ముందు ఏ శక్తీ నిలవలేదని ఈ పరిణామం మరోసారి రుజువు చేసిందని, ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యోగికి, కార్మికుడికి అభినందనలు తెలియజేశారు.

​బిల్ కలెక్టర్ల దీక్షలకు సంపూర్ణ మద్దతు గత 22 రోజులుగా తిరుపతి సీఎండీ కార్యాలయం వద్ద బిల్ కలెక్టర్లు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు స్ట్రగుల్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story